హిందీ మాట్లాడేవారే భారతీయులు, మిగతావాళ్ళు రెండవ తరగతి పౌరులా ?....ప్రశ్నించిన స్టాలిన్

దేశంలో హిందీ భాష వినియోగం పెంచడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల రాష్ట్రపతికి సమర్పించిన నివేదికపై స్టాలిన్ మండిపడ్డారు. తమపై మరో భాషా యుద్ధాన్ని రుద్దవద్దని స్టాలిన్ అన్నారు. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని స్పష్టం చేశారు.

Advertisement
Update: 2022-10-10 12:25 GMT

హిందీని బలవంతంగా రుద్దేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారినే భారతీయ పౌరులుగా, మిగతావారిని రెండవ‌ తరగతి పౌరులుగా చూడటం దేశాన్ని విభజించడమే అని ఆయన ద్వజమెత్తారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఒకే దేశం, ఒక భాష, ఒకే మతం, ఒకే ఆహారం, ఒకే సంస్కృతిని అమలు చేస్తుందని తమిళనాడు స్టాలిన్ ఆరోపించారు. ఇది భారత యూనియన్‌ను దెబ్బతీస్తుందని అన్నారు.

దేశంలో హిందీ భాష వినియోగం పెంచడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల రాష్ట్రపతికి సమర్పించిన నివేదికపై స్టాలిన్ మండిపడ్డారు.

ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీ బోధనా మాధ్యమంగా ఉండాలని నివేదిక సిఫార్సు చేసినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు.

''ఒకవైపు ఇప్పుడున్నన్న‌ 22 అధికార భాషలకు తోడు మరిన్ని భాషలను చేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న సమయంలో అటువంటి నివేదిక అవసరం ఏమొచ్చింది? కేంద్ర ప్రభుత్వ పోస్టుల పోటీ పరీక్షల నుంచి ఆంగ్లాన్ని తొలగించాలని ఎందుకు సిఫార్సు చేశారు? '' అని స్టాలిన్‌ను ప్రశ్నించారు.

హిందీని అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరాలని ఈ నివేదిక సూచించిందని, ఈ చర్య హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నమే అని స్టాలిన్ ఆరోపించారు.

తమపై మరో భాషా యుద్ధాన్ని రుద్దవద్దని స్టాలిన్ మండిపడ్డారు. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని స్పష్టం చేశారు.


Tags:    
Advertisement

Similar News