బీహార్ లో ప్రారంభమైన కుల ప్రాతిపదికన జనాభా గణన

''కుల ఆధారిత సర్వే శాస్త్రీయ డేటాను అందజేస్తుంది, తద్వారా బడ్జెట్, సాంఘిక సంక్షేమ పథకాలు తదనుగుణంగా రూపొందించబడతాయి. బిజెపి పేదలకు వ్యతిరేకం, అందుకే ఇది జరగాలని వారు కోరుకోవడం లేదు" అని బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ అన్నారు.

Advertisement
Update: 2023-01-07 07:21 GMT

బీహార్‌లో కుల ప్రాతిపదికన జనాభా గణన శనివారం ప్రారంభమయ్యింది. మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా జనాభా గణన‌ నిర్వహించనున్నారు.

''కులాల సర్వేను ఈరోజు ప్రారంభించాము, మొదటి దశ జనవరి 7 నుండి జనవరి 21 వరకు జరుగుతుంది. రెండవ దశ ఏప్రిల్‌లో జరుగుతుంది, ఇందులో సామాజిక-ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారం తీసుకోబడుతుంది. పాట్నాలో మొత్తం 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి, వాటిని 1వ దశలో లెక్కిస్తాం’’ అని పాట్నా డీఎం తెలిపారు.

''కుల ఆధారిత సర్వే శాస్త్రీయ డేటాను అందజేస్తుంది, తద్వారా బడ్జెట్, సాంఘిక సంక్షేమ పథకాలు తదనుగుణంగా రూపొందించబడతాయి. బిజెపి పేదలకు వ్యతిరేకం, అందుకే ఇది జరగాలని వారు కోరుకోవడం లేదు" అని బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ అన్నారు.

534 బ్లాక్లు, 261 పట్టణ స్థానిక సంస్థలను కలిగి ఉన్న 38 జిల్లాల్లోని 2.58 కోట్ల కుటుంబాలలో 12.70 కోట్ల జనాభాను ఈ సర్వే కవర్ చేస్తుంది. మే 31, 2023 నాటికి సర్వే పూర్తవుతుంది.

శాంతి యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అంతకుముందు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపకులాలు, పౌరుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించడానికి ప్రభుత్వం అధికారులకు శిక్షణ ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర, దేశాభివృద్ధికి జనాభా గణన ఎంతో మేలు చేస్తుందన్నారు.

"మేము వివరణాత్మక కుల గణనను నిర్వహించడానికి మా అధికారులకు శిక్షణ ఇచ్చాము. ఇది రాష్ట్ర అభివృద్ధికి , దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది" అని నితీష్ మీడియాతో అన్నారు.

Tags:    
Advertisement

Similar News