ఛత్తీస్‌గఢ్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. మృతులు 17 మందిపైనే

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడం వల్ల 17 మంది మరణించారు.

Advertisement
Update: 2024-05-25 07:53 GMT

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడం వల్ల 17 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. తక్షణం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సమీప రాయ్ పూర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ బెమెతర జిల్లాలోని గన్ ఫౌండర్ పరిశ్రమలో ఈ భారీ పేలుడు సంభవించింది. రోజూ మాదిరిగానే ఈ ఉదయం పరిశ్రమకు వచ్చిన కూలీలు తయారీ పనులు మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతమంతటా మంటలు వ్యాపించి, దట్టమైన పొగ కమ్మేసింది. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో గన్ ఫౌండర్ ఫ్యాక్టరీ మొదటి షిఫ్ట్ లో దాదాపు 100 మంది ఉన్నట్లు అంచనా. పేలుడు ధాటికి నేలపై 20 అడుగుల భారీ గొయ్యి ఏర్పడింది. అందులో కూడా పలువురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే ప్రమాదం ధాటికి పైకప్పులు విరిగిపడటంతో వాటి శిథిలాల మధ్య కూడా కొందరు చిక్కుకొని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

 

ఎటుచూసినా తెగిపోయి అవయవాలు, బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగినది గన్‌పౌడర్‌ తయారీ ఫ్యాక్టరీలో కావడంతో రసాయనాల ప్రభావం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే, పేలుడు ఎందుకు జరిగింది, అలాగే మృతుల సంఖ్యపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News