హేమ బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్స్‌.. తర్వాత జరిగేది ఇదే..

రేవ్‌ పార్టీకి కృష్ణవేణి పేరుతో హాజరైంది నటి హేమ. అందుకే పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు.

Advertisement
Update: 2024-05-23 08:54 GMT

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను నార్కోటిక్ అధికారులు గుర్తించారు. మొత్తం 150 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో 86 మంది రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించాయి. 59 మంది పురుషులు.. 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ 86 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. హేమతో పాటు పార్టీ నిర్వహించిన వాసు, మరోనటి అషీరాయ్‌ కూడా డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలింది. వీరితో పాటు చాలామంది తెలుగు ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించారు. వీరందరికీ పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

నెక్స్ట్‌ ఏం జరగబోతోంది..?

రేవ్‌ పార్టీకి కృష్ణవేణి పేరుతో హాజరైంది నటి హేమ. అందుకే పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు. హేమను నిందితురాలిగా కాకుండా బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. హేమను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశాలున్నాయి. రేవ్‌ పార్టీలోకి డ్రగ్స్‌ తెచ్చింది ఎవరు?. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

హేమ డ్రామాలు..

బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ టాలీవుడ్‌ను కుదిపేసింది. రేవ్‌ పార్టీలో తన పేరు వచ్చిన వెంటనే హేమ జాగ్రత్త పడింది. ఫాంహౌస్‌ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అంటూ కవరింగ్ చేసింది. కానీ, ఆ అవేవీ వర్క్‌ఔట్ కాలేదు. రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ ఫొటోను పోలీసులు విడుదల చేయడంతో ఆమె కంగుతింది. తర్వాత ఇంట్లో బిర్యానీ వండుతున్న మరో వీడియోను సైతం విడుదల చేసింది. తాజాగా హేమ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా హేమ తగ్గట్లేదు. తాను పార్టీలోనే పాల్గొనలేదని.. ఏం చేస్తారో చేస్కోండని బుకాయిస్తోంది. చూడాలి మరి రేవ్ పార్టీ కేసుకు బెంగళూరు పోలీసులు ఎలా ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నారో.

Tags:    
Advertisement

Similar News