ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌.. గ‌డువు జూన్ 14 వ‌ర‌కు పొడిగింపు

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గ‌డువును కేంద్రం మ‌రోసారి పొడిగించింది.

Advertisement
Update: 2024-03-12 15:51 GMT

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గ‌డువును కేంద్రం మ‌రోసారి పొడిగించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న గ‌డువు మార్చి 14తో ముగియనుండటంతో దాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది.

మూడోసారి పొడిగింపు

ఆధార్‌లో డేటా ఫ్రీ అప్‌డేట్‌కు తొలుత 2023 మార్చి 15 వరకు గ‌డువు ఇచ్చారు. త‌ర్వాత ఆరు నెల‌లు పెంచి డిసెంబరు 14 వరకు ఇచ్చారు. మ‌ళ్లీ మూడు నెల‌లు పెంచి ఈఏడాది మార్చి 14 వరకు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో గ‌డువును మ‌రో మూడు నెల‌లు పొడిగించామ‌ని ఉడాయ్ ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News