ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. - ఏడుగురు శిశువులు మృతి

అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగిందని, తమకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Advertisement
Update: 2024-05-26 06:26 GMT

ఢిల్లీలోని శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని వివేక్‌ విహార్‌లో ఉన్న ఈ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా గుర్తించలేదు. శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగిందని, తమకు సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఢిల్లీలోనే శనివారం అర్ధరాత్రే మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 13 మందిని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల గేమింగ్‌ జోన్‌లో చెలరేగిన మంటల్లో 27 మంది ఆహుతైన ఘటన నుంచి తేరుకోకముందే ఢిల్లీలో నవజాత శిశువులు అగ్నిప్రమాదంలో మృతిచెందడం శోచనీయం.

Tags:    
Advertisement

Similar News