హేమకు మంచు విష్ణు మద్దతు.. తప్పుడు ప్రచారం వద్దంటూ విజ్ఞప్తి

బెంగళూరు రేవ్‌ పార్టీలో తాను పాల్గొనలేదని హేమ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Update: 2024-05-26 14:37 GMT

రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సోషల్‌ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు.. హేమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తల్లిగా, భార్యగా ఉన్న హేమపై లేని వదంతులు సృష్టించడం, దూషించడం తగదన్నారు. నిర్ధారణ లేని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలన్నారు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందన్నారు. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. అప్పటివరకూ సంచలనాల కోసం హేమపై తప్పు ప్రచారం చేయొద్దని ట్విట్టర్‌లో కోరారు.

బెంగళూరు రేవ్‌ పార్టీలో తాను పాల్గొనలేదని హేమ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ సహా మొత్తం 86 మందికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News