పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం... ఆహారం కోసం కొట్టుకుంటున్న ప్రజలు

గోధుమలు, గోదుమ‌ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.

Advertisement
Update: 2023-01-10 10:40 GMT

పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం... ఆహారం కోసం కొట్టుకుంటున్న ప్రజలు

పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర తరమయ్యింది. ప్రజలకు సరిపడ ఆహార పదార్థాలు లేక ఆకలితో అల్లాడి పోతున్నారు. డబ్బులున్నా ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది.

గోధుమలు, గోదుమ‌ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.

ప్రభుత్వం సాయుధ గార్డుల కాపలా మధ్య పిండిని పంచుతోంది. అయినప్పటికీ ప్రజల మధ్య ఘర్షణలు తగ్గడం లేదు.

ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ప్రకారం, పాకిస్తాన్‌లో గోధుమలు, గోదుమ‌ పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. కరాచీలో కిలో పిండిని రూ.140 నుంచి రూ.160కి విక్రయిస్తున్నారు. ఇస్లామాబాద్, పెషావర్‌లలో 10 కిలోల పిండిని కిలో రూ.1,500కు విక్రయిస్తుండగా, 20 కిలోల పిండిని రూ.2,800కి విక్రయిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని మిల్లు యజమానులు కిలో పిండి ధరను రూ.160కి పెంచారు. బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్‌జాయ్ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని అన్నారు. బలూచిస్థాన్‌కు తక్షణమే 4,00,000 గోధుమల బస్తాలు అవసరమని, లేకుంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

అదేవిధంగా, ఖైబర్ పఖ్తున్ఖ్వా అత్యంత ఘోరమైన పిండి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, అక్కడ వ్యాపారులు 20 కిలోల పిండిని 3100 రూపాయలకు విక్రయిస్తున్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 'ది న్యూస్ ఇంటర్నేషనల్' నివేదించింది.

సింధ్ ప్రభుత్వం సబ్సిడీ పిండిని ప్రజలకు విక్రయిస్తున్న సమయంలో మిర్పుర్ఖాస్ అనే ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ప్రభుత్వం 10 కిలోల పిండి బస్తాలను కిలో రూ.65 చొప్పున విక్రయిస్తుండడంతో పిండి బస్తాలు తీసుకొచ్చే వాహనాల చుట్టూ పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు ఒకరినొకరు తోసుకున్నారు.

ఈ గందరగోళంలో 40 ఏళ్ల కార్మికుడు హర్‌సింగ్ కొల్హి రోడ్డుపై పడిపోయాడని, వందలాది మంది ప్రజల కాళ్ళ కింద పడి అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.

పెషావర్‌లోని నివాసి ఒకరు చేసిన ట్వీట్ ప్రకారం, పేదలు, ధనవంతుల కూడా గోధుమ పిండి గురించి ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఒక వ్యక్తి వారానికి ఒకసారి మాత్రమే పిండి కొనుగోలు చేయగలరని అతను తెలిపారు.

రొట్టెల ధరలు విపరీతంగా పెరిగాయి. అన్ని బేకరీ వస్తువులను అధిక ధరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో ప్రతి రోజూ గొడవలు కూడా అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, పిష్టఖారాలో ఇద్దరు స్థానికులు రొట్టె ధరపై హోటెల్ యజమానితో గొడవపడి అతనిపై కాల్పులు జరపడంతో ఒక బాటసారి మరణించాడు.

పాకిస్తాన్‌లో గోధుమ సంక్షోభానికి కేద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని తెలుస్తోంది. 


Tags:    
Advertisement

Similar News