సుడాన్ లో మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో ఒక భారతీయుడితో సహా 56 మందిమృతి!

భారతీయులు ఇళ్ళు దాటి బైటికి రావద్దని అక్కడి ఇండియా ఎంబసీ భారతీయలను కోరింది. అయితే నిన్న జరిగిన‌కాల్పుల్లో దాల్.. గ్రూప్ లో పనిచేస్తున్న అల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు చనిపోయినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది.

Advertisement
Update: 2023-04-16 09:33 GMT

సుడాన్ లో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ అధికారంలో ఉన్న సుడాన్ లో పౌర ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని పారా మిలటరీ కోరుతుండగా , తామే అధికారంలో ఉంటామని మిలటరీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నాలుగు వారాలుగా జరుగుతున్న చర్చలు విఫలం అవడంతో రెండు రోజులుగా ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ ప్రస్తుతం అంతర్యుద్ద‌ వాతావరణమ నెలకొంది.

ఈ నేపథ్యంలో భారతీయులు ఇళ్ళు దాటి బైటికి రావద్దని అక్కడి ఇండియా ఎంబసీ భారతీయలను కోరింది. అయితే నిన్న జరిగిన‌కాల్పుల్లో దాల్.. గ్రూప్ లో పనిచేస్తున్న అల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు చనిపోయినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది.

మరో వైపు సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు. మరోవైపు సూడాన్‌ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.


Tags:    
Advertisement

Similar News