జుట్టుకి రంగేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి ఎందుకంటే..

జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని నాచురల్‌ ఆయిల్స్‌ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది.

Advertisement
Update: 2024-05-25 14:22 GMT

మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. సమస్య వచ్చిన తరువాత ఇక వేరే ఆప్షన్ లేక జుట్టుకి రంగు వేసుకోవటం మొదలుపెడతారు. కొందరు మాత్రం ఫ్యాషన్ పేరుతో జుట్టుకు రకరకాల రంగులను వేసుకొని ఎంజాయ్ చేస్తారు. ఇలా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల చూడడానికి బాగా, స్టైల్ గా కనిపిస్తున్న కానీ, తరచూ అలా చేయడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


అవేంటంటే..

జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని నాచురల్‌ ఆయిల్స్‌ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది. అలాగే జుట్టు క్యూటికల్స్ కూడా దెబ్బతింటాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అన్ని రకాల హెయిర్ కలర్స్ లో కెమికల్స్ కచ్చితంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాటిలో వాడే అమ్మోనియా, ప్రోస్టియన్, గ్లైకోల్, పిపిడి లాంటి కెమికల్స్ వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, అలర్జీ లు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.




తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

జుట్టుకు రంగు వేసుకుంటే, క్రమం తప్పకుండా నూనె రాసుకోవాలి. ముఖ్యంగా షాంపూ చేయడానికి ముందు జుట్టుకు వేడి నూనెతో మసాజ్ చేసుకోవాలి. వారానికి మూడు రోజులు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. క్లోరిన్ తక్కువగా ఉన్న నీళ్లతో స్నానం చేయాలి. షాంపూ చేసిన తర్వాత కండీషనర్ రాయడం, జుట్టు పొడిబారిపోతే హెయిర్ సీరమ్ వాడటం అలవాటు చేసుకోవాలి. అసలు రసాయనాలతో కూడిన హెయిర్ కలర్లు వేయడం కంటే, ప్రకృతిలో సహజంగా దొరికే వాటిని వాడటం మంచిది. ఎందుకంటే సహజరంగు ఒక్కసారి వాడితే మళ్లీ కనీసం నెల రెండు నెలల వరకు జుట్టు రంగు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అలాగే వాటివల్ల సైడ్ ఎఫెక్టులు కూడా రావు. వీటివల్ల జుట్టు రంగు మారడంతోపాటూ, ఆరోగ్యంగా కుదుళ్లు బలంగా తయారవుతుంది.

Tags:    
Advertisement

Similar News