దసరా విన్నర్ భగవంత్ కేసరి

భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

Advertisement
Update: 2023-10-24 11:45 GMT

దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది తెలుగు అగ్ర హీరోలైన బాలకృష్ణ, రవితేజ నటించిన భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదలయ్యాయి. తమిళం నుంచి అక్కడి అగ్ర హీరో విజయ్ నటించిన లియో కూడా తెలుగులో విడుదల అయ్యింది. పండుగకు వచ్చిన ఈ మూడు సినిమాల్లో భగవంత్ కేసరి సూపర్ హిట్ స్టేటస్ తెచ్చుకోగా, లియో యావరేజ్, టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. మొత్తానికి భగవంత్ కేసరి భారీ కలెక్షన్లు సాధిస్తూ దసరా విన్నర్‌గా నిలిచింది.

భగవంత్ కేసరి విడుదలైన నాలుగు రోజుల్లో రూ. 104 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఐదో రోజైన దసరా పండుగ నాడు కూడా భగవంత్ కేసరి సాలిడ్ ఆక్యూపెన్సీని సాధించినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ కు చేరుకోనుంది.

ఇక లియో మూవీ యావరేజ్ టాక్ తోనే విడుదలైన తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించింది. ఈ మూవీ తక్కువ బిజినెస్ చేయడంతో తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించి బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో నిలిచింది. భగవంత్ కేసరి మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తుండగా.. ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే వన్ మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. భారీ కలెక్షన్లతో భగవంత్ కేసరి సినిమా దసరా విజేతగా నిలిచింది.

Tags:    
Advertisement

Similar News