ఉప్పు తగ్గించడం వల్ల ఎన్ని లాభాలంటే..

సాధారణంగా కూరల్లో రుచి కోసం ఉప్పు వాడుతుంటారు. అయితే రోజువారీ ఆహారంలో ఉప్పు(సోడియం) సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు.

Advertisement
Update: 2024-05-24 06:22 GMT

సాధారణంగా కూరల్లో రుచి కోసం ఉప్పు వాడుతుంటారు. అయితే రోజువారీ ఆహారంలో ఉప్పు(సోడియం) సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. ఉప్పు ఎక్కువైతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రోజువారీ డైట్‌లో ఉప్పు తగ్గించడం వల్ల ఎన్ని లాభాలంటే..

ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుందని చాలామందికి తెలుసు. అయితే ఉప్పుతో బీపీ ఒక్కటే కాదు, పొట్టలో అల్సర్లు, తలనొప్పి, థైరాయిడ్ వంటి రకరకాల సమస్యలకు ఉప్పు కారణమవుతోందట. కాబట్టి ఉప్పుని కంట్రోల్ చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఉప్పు తగ్గించడం ద్వారా రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తక్కువ ఉప్పు కిడ్నీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో సోడియం లెవల్స్ పెరగడం వల్ల కిడ్నీలపై అధిక భారం పడుతుంది. ఉప్పు ఎక్కువా తింటే క్రమంగా మూత్రపిండాల పని తీరు దెబ్బతింటుంది. కాబట్టి ఉప్పు తగ్గిస్తే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

శరీరంలో సోడియం ఎక్కువైతే క్రమంగా క్యాల్షియం కరిగిపోతుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి తక్కువ ఉప్పు తీసుకోవడం ద్వారా ఎముకలకు ఎక్కువ క్యాల్షియం అందేలా చేయొచ్చు. బోన్ డెన్సిటీని పెంచుకోవచ్చు.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని స్టడీల్లో తేలింది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించడం ద్వారా క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇది రకరకాల సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఉప్పుని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అందులోనూ రిఫైన్డ్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ లేదా పింక్ రాల్ట్ వంటివి తీసుకుంటే మంచిది.

ఉప్పుని పూర్తిగా మానేయడం కూడా సరికాదు. ఎందుకంటే రక్తపోటుని కంట్రోల్ చేయడంలో, హార్మోనల్ బ్యాలెన్స్‌కి ఉప్పు చాలా అవసరం. కాబట్టి ఉప్పుని పూర్తిగా పక్కన పెట్టకుండా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News