ఇండియాలో డయాబెటిస్‌కు కారణాలివే..

మనదేశంలో గుండె సమస్యలకు ముఖ్యంగా ధూమపానమే కారణమట. అలాగే బీపీ, డయాబెటిస్‌కు ఒబెసిటీ, వ్యాయామం లేకపోవడం, లైఫ్‌స్టైల్ మార్పులు కారణమని తేలింది. దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటు బారినపడ్డారు

Advertisement
Update: 2022-09-03 12:30 GMT

మనదేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు రావడానికి ఏయే అంశాలు ఎక్కువగా కారణమవుతున్నాయో తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ చేశారు. అందులో తెలిసిన విషయాలు ఏమిటంటే..

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు, డయాబెటిస్ రావడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కార్డియాలజిస్టు డా.హయగ్రీవరావు నేతృత్వంలో ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 15 ప్రముఖ ఆసుపత్రుల్లో రీసెర్చ్ చేశారు. దీని కోసం రెండేళ్ల పాటు 2,153 మంది రోగులను పరిశీలించారు.


ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే.. మనదేశంలో గుండె సమస్యలకు ముఖ్యంగా ధూమపానమే కారణమట. అలాగే బీపీ, డయాబెటిస్‌కు ఒబెసిటీ, వ్యాయామం లేకపోవడం, లైఫ్‌స్టైల్ మార్పులు కారణమని తేలింది. దేశంలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటు బారినపడ్డారు. 50 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు, మహిళల్లో నాలుగింట ఒక వంతు గుండెపోటుకు గురయ్యారు. సుమారు 10 శాతం మంది 40 సంవత్సరాలలోపే గుండె జబ్బుల బారినపడ్డారు. మనదేశంలో పొగతాగడం, బరువు పెరగడం, శారీరక శ్రమ లేకపోవటం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్ల వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఆ రీసెర్చ్ చేసిన డాక్టర్లు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News