Shruti Hassan | రాజకీయాల్లోకి శృతిహాసన్?

Shruti Hassan - కమల్ హాసన్ కూతురిగా, స్టార్ హీరోయిన్ గా శృతిహాసన్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతోందా? దీనిపై ఆమె ప్రకటన చేసింది.

Advertisement
Update: 2023-10-20 17:01 GMT

నటీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని దశాబ్దాలుగా, తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో రాజకీయ ప్రపంచంలోకి ప్రవేశించిన అనేక మంది తారలను మనం చూశాం. వీళ్లలో కొందరు ముఖ్యమంత్రులైన వాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం పాలిటిక్స్ లో చురుగ్గా ఉన్న నటుడు కమల్ హాసన్. తండ్రి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో, కూతురు శృతి హాసన్ కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తి చూపుతుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

కొన్ని నెలల క్రితం, తన తండ్రి రాజకీయ ప్రయాణంలో శృతి హాసన్ ఏదో ఒక పాత్ర పోషిస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లను శృతిహాసన్ కొట్టేసింది. ఆమె స్పందిస్తూ, తాను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నానని, తన ఆసక్తి సినిమా ఫీల్డ్‌పై మాత్రమేనని చెప్పింది. "నేను నా కెరీర్‌లో మంచి సినిమాల్ని నిర్మించాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు." అంటూ విస్పష్టంగా ప్రకటించింది.

ఎన్నికల సమయంలో తండ్రి కోసం శృతిహాసన్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అది కేవలం తన తండ్రికి నైతిక మద్దతు కోసమేనని, తను ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయనని, కేవలం తన తండ్రి కమల్ కు ఓటేయమని మాత్రమే అడుగుతానని అంటోంది శృతిహాసన్.

శృతి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఈ సంవత్సరం, ఆమె వాల్టేర్ వీరయ్య, వీరసింహారెడ్డి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. డిసెంబర్‌లో ప్రభాస్‌ 'సలార్‌'లో కూడా కనిపించనుంది. హాలీవుడ్ ప్రాజెక్ట్ 'ది ఐ'లో కూడా ఆమె కనిపించనుంది. నాని రాబోయే చిత్రం 'హాయ్ నాన్న'లో అతిధి పాత్ర చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News