Shivani Rajasekhar | ఉప్పెన అందుకే ఒప్పుకోలేదు

Shivani Rajasekhar - వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా శివానీ రాజశేఖర్ ను అనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు.

Advertisement
Update: 2023-11-28 01:44 GMT

ఉప్పెన సినిమాను తిరస్కరించడానికి కారణాలను వెల్లడించింది హీరోయిన్ శివాని రాజశేఖర్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా ఉప్పెన. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్‌ హీరోగా పరిచయమయ్యాడు. ఉప్పెన సినిమా సంచలన విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఈ సినిమాతో కృతి శెట్టి స్టార్ అయిపోయింది. మరి శివానీ రాజశేఖర్ ఎందుకు వదులుకుంది?

శివాని రాజశేఖర్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి చాలా రోజులైంది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ సాధించలేకపోయింది. అలాంటి టైమ్ లో ఉప్పెన ఆఫర్ వచ్చింది. అయితే దాన్ని ఆమె తిరస్కరించింది. స్టోరీ డ్రాఫ్ట్‌లో స్క్రిప్ట్‌ బోల్డ్ గా ఉందంట. హీరోతో చాలా క్లోజ్ గా ఉండే సన్నివేశాలున్నాయట. అలాంటి సన్నివేశాల్ని తను చేయలేనని, అందుకే ఉప్పెన సినిమాని తిరస్కరించానని చెప్పుకొచ్చింది శివానీ. అయితే ఆ తర్వాత స్క్రిప్ట్ మార్చారు. కొన్ని సీన్లు మార్చారు. కృతి శెట్టిని తీసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఉప్పెన సినిమా మిస్ అయినందుకు బాధ లేదంటోంది శివానీ. అది తను తీసుకున్న నిర్ణయమని చెబుతోంది. భవిష్యత్తులో కూడా లిప్ లాక్ లాంటి సన్నివేశాలు ఎదురైతే, తను దూరంగా ఉంటానని చెబుతోంది.

తాజాగా ఈ హీరోయిన్ కోటబొమ్మాలి పీఎస్ అనే సినిమా చేసింది. ఇందులో ఆమె పోషించిన కానిస్టేబుల్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఇలా ఉప్పెన మేటర్ ను బయటపెట్టింది శివానీ. 

Tags:    
Advertisement

Similar News