Samantha: సమంత కొత్త ప్రాజెక్టులు అందుకే సైన్ చేయడం లేదా?

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే హీరోయిన్ గా నటించిన సినిమా "యశోద". ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాలో సమంత ఒక యాక్షన్ రోల్లో కనిపించింది.

Advertisement
Update: 2022-12-13 14:02 GMT

సమంత కొత్త ప్రాజెక్టులు అందుకే సైన్ చేయడం లేదా?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్యనే హీరోయిన్ గా నటించిన సినిమా "యశోద". ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాలో సమంత ఒక యాక్షన్ రోల్లో కనిపించింది. సినిమా విడుదల మరియు ప్రమోషన్ సమయంలో కూడా సమంత ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేని సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కాలేదు కానీ డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్ ప్రాజెక్టుగా నిలిచింది. మొదటి వారాంతానికే సినిమా చాలా వరకు రికవరీ చేసేసింది. కంటెంట్, హీరో తో సంబంధం లేకుండా కేవలం సమంత తన అభిమానులను థియేటర్లకు రప్పించగలదు అని చెప్పడానికి ఈ సినిమాని అతిపెద్ద ఉదాహరణ గా చెప్పచ్చు. ప్రస్తుతం సమంత చేతుల్లో ఇప్పుడు రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న మైథాలజికల్ సినిమా "శాకుంతలం" కాగా మరొకటి విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "ఖుషీ". శివా నిర్వాన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మజిలీ సినిమా తర్వాత సమంత మరియు శివా నిర్వాన కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. సామ్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా "ఖుషీ" సినిమా షూటింగ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది.

ఇక ప్రస్తుతం సమంత ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాక మిగతా ప్రాజెక్టులకు సైన్ చేయాలని చూస్తోంది. ఇక మయోసైటిస్ అనే ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి తో సమంత చాలా బాధపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత ఆరోగ్యపరంగా ఇంకా కోలుకుంటుంది.

Tags:    
Advertisement

Similar News