Harish Shankar - హరీశ్ శంకర్ కు ఎందుకంత తొందర!

Harish Shankar - ఒక్క షెడ్యూల్ కే హరీష్ ఎందుకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు. అంత తొందర ఎందుకు?

Advertisement
Update: 2023-05-12 13:00 GMT

నిన్నంతా ఉస్తాద్ భగత్ సింగ్ హంగామా నడిచింది. ఆ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నిన్న గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే ఈ విషయంలో యూనిట్ తొందర పడిందనేది చాలామంది అభిప్రాయం.

ఎందుకుంటే, ఈ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసింది కేవలం ఒకే ఒక్క షెడ్యూల్. ఆ షెడ్యూల్ లో క్లిప్స్ తోనే ఆదరబాదరాగా ఈ గ్లింప్స్ కట్ చేశారు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అవ్వదు. ముందుగా వినోదాయశితం రీమేక్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత హరిహర వీరమల్లు లేదా ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలవుతుంది.

కాబట్టి, మే 11 (గబ్బర్ సింగ్ విడుదల తేదీ) అనేది వచ్చే ఏడాది కూడా వస్తుంది. అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వదనేది చాలామంది అభిప్రాయం. కాబట్టి ఇంత తొందరగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయడంలో అర్థం లేదంటున్నారు చాలామంది.

పైగా ఇలా ముందుగానే గ్లింప్స్ విడుదల చేయడం వల్ల యూనిట్ పై ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. గ్లింప్స్ రిలీజై ఎన్నాళ్లయిందో చెబుతూ, ఇంకా సినిమా విడుదల చేయరా అంటూ అభిమానుల నుంచి కామెంట్స్ వినిపించే ప్రమాదం ఉందంటున్నారు.

Tags:    
Advertisement

Similar News