This weekend Movie Releases: ఈ వారం 7 సినిమాలు

This weekend Movie Releases:: ఈవారం 7 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాల విశేషాలేంటో చూద్దాం..

Advertisement
Update: 2023-02-01 16:00 GMT

సంక్రాంతి సినిమాల సందడి తగ్గడంతో ఈ వారం ఏకంగా 7 సినిమాలు క్యూ కట్టాయి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈవారం వస్తున్న సినిమాల్లో కొన్ని సినిమాలపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. పేరుకు చిన్న సినిమాలే అయినప్పటికీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది. సందీప్ కిషన్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. టీజర్, ట్రయిలర్ కు భారీ రెస్పాన్స్ రావడం, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి నటీనటులు నటించడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.

మైఖేల్ కు పోటీగా రైటర్ పద్మభూషణ్ సినిమా వస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి. సుహాస్ తొలి థియేట్రికల్ రిలీజ్ ఇది. ఇప్పటికే చాలా ప్రివ్యూలు వేశారు. వాటి ద్వారా మంచి టాక్ వచ్చింది. అలా సుహాస్ సినిమా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది.

ఈ సినిమాలతో పాటు.. 3వ తేదీన ప్రేమదేశం, మాయగాడు, తుపాకులగూడెం, సువర్ణ సుందరి అనే మరో 4సినిమాలు కూడా వస్తున్నాయి. త్రిగుణ్ హీరోగా నటించిన ప్రేమదేశంలో అలనాటి నటి మధుబాల కీలక పాత్ర పోషించింది. ఇక నవీన్ చంద్ర హీరోగా మాయగాడు సినిమా వస్తోంది.

ఇక 4వ తేదీన బుట్టబొమ్మ సినిమా వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పెళ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. బాలనటి అనికా సురేంద్రన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. తమిళనాట పాపులరైన అర్జున్ దాస్ ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ ఇస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది బుట్టబొమ్మ.

Tags:    
Advertisement

Similar News