Weekend Release | ఈవారం 6 సినిమాలు

Weekend Release- ఈవారం 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే.

Advertisement
Update: 2024-02-23 02:05 GMT

ఈ వారం టాలీవుడ్ లోకి 6 సినిమాలొస్తున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కాకపోతే వీటిలో కొన్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైంది సుందరం మాస్టార్. కమెడియన్ హర్ష చెముడు హీరోగా మారి చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. స్వయంగా చిరంజీవి ప్రమోట్ చేయడం యూనిట్ కు బాగా కలిసొచ్చింది. దీనికితోడు రవితేజ నిర్మాతగా వస్తున్న సినిమా కూడా కావడంతో అందరి దృష్టి పడింది.

ఈ సినిమాకు పోటీగా మస్త్ షేడ్స్ ఉన్నాయిరా అనే మరో సినిమా కూడా వస్తోంది. ఈ మూవీతో మరో కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రయిలర్ తో అంచనాలు పెంచిన సినిమా ఇది.

ఈ రెండు సినిమాలతో పాటు.. భ్రమయుగం, సిద్దార్థ్ రాయ్, సైరన్, ముఖ్య గమనిక అనే సినిమాలు కూడా వస్తున్నాయి. మమ్ముట్టి నటించిన భ్రమయుగం మలయాళంలో ఆల్రెడీ పెద్ద హిట్. అందుకే ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

ఇక ఎన్నో హిట్ సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించిన దీపక్ సరోజ్, సిద్దార్థ్ రాయ్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. కీర్తిసురేష్ పోలీసాఫీసర్ గా నటించిన సినిమా సైరన్ తో పాటు ముఖ్యగమనిక అనే మరో చిన్న సినిమా కూడా వస్తోంది. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News