Sharwanand Car Accident: నాలుగు రోజుల్లో పెళ్లి.. సినీ నటుడు శర్వానంద్‌కు యాక్సిడెంట్

Sharwanand Car Accident: శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయని, కార్లో ఉన్న మిగిలిన వారు క్షేమంగానే ఉన్నట్లు శర్వా టీమ్ తెలియజేసింది.

Advertisement
Update: 2023-05-28 06:16 GMT

టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద శనివారం అర్థరాత్రి శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో శర్వానంద్ డ్రైవింగ్ చేయడం లేదని, పక్కన కూర్చొని ఉన్నట్లు తెలుస్తున్నది. బైక్‌ను తప్పించబోయి.. కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలుస్తున్నది.

శనివారం అర్థ రాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలయ్యాయని, కార్లో ఉన్న మిగిలిన వారు క్షేమంగానే ఉన్నట్లు శర్వా టీమ్ తెలియజేసింది. కారుకు చిన్న స్క్రాప్స్ పడ్డాయని చెప్పారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని టీమ్ చెప్పింది. కాగా, ప్రమాదం అనంతరం శర్వానంద్ సమీపంలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

శర్వానంద్‌కు మరో నాలుగు రోజుల్లో పెళ్లి కావల్సి ఉన్నది. తన ప్రియురాలు రక్షితా రెడ్డితో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గ్రాండ్‌గా వివాహం చేసుకోవడానికి శర్వానంద్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పడు అకస్మాతుగా ప్రమాదం జరగడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  


Tags:    
Advertisement

Similar News