Waltair Veerayya | బుల్లితెరపై ఆకట్టుకోలేకపోయిన మెగాస్టార్

Waltair Veerayya Movie | థియేటర్లలో సూపర్ హిట్టయింది వాల్తేరు వీరయ్య సినిమా. అయితే ఈ సినిమా బుల్లితెర వీక్షకుల్ని మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Advertisement
Update: 2023-11-04 07:32 GMT

Waltair Veerayya | బుల్లితెరపై ఆకట్టుకోలేకపోయిన మెగాస్టార్

థియేటర్లలో హిట్టయిన వాల్తేరు వీరయ్య బుల్లితెరపై ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు చాలా తక్కువ టీఆర్పీ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో వాల్తేరు వీరయ్యను ప్రసారం చేస్తే, కేవలం 4.56 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఈ రేటింగ్ చూసి మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరీర్‌లో 154వ సినిమా. మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. దసరా కానుకగా జెమినీ టీవీలో ప్రసారం చేశారు.

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల స్థాయిలో రేటింగ్ రాకపోయినా, పండగ సీజన్ కాబట్టి భారీగా టీఆర్పీ వస్తుందని అంతా అంచనా వేశారు. కానీ వాల్తేరు వీరయ్యను బుల్లితెర వీక్షకులు పట్టించుకోలేదు. బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమా, టీవీల్లో మాత్రం ఫెయిలైంది.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి-రవితేజ కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఇలా మల్టీస్టారర్ మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య, టీవీల్లో ఫెయిల్ అవ్వడం ఆశ్చర్యకరమైన విషయం.

Tags:    
Advertisement

Similar News