Vyuham | వ్యూహం నుంచి ఇంటెన్స్ పోస్టర్స్

Vyuham Movie - రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది వ్యూహం. ఈ మూవీ నుంచి 2 ఇంటెన్స్ పోస్టర్లు రిలీజ్ చేశాడు వర్మ.

Advertisement
Update: 2023-07-18 12:08 GMT

కుట్రలకి, ఆలోచనలకి మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడే వైయస్‌.జగన్‌. ఫస్ట్‌ ఇంటెన్స్‌ పోస్టర్‌ ఆఫ్‌ ‘వ్యూహం’ వచ్చేసింది. టెక్నికల్‌గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్‌ సెట్ చేయగల పోస్టర్‌ డిజైనర్స్‌ అనిల్‌ అండ్‌ భాను వ్యూహం పోస్టర్లను క్రియేట్ చేశారు.

జగన్‌ పాత్రను పోషించిన అజ్మల్‌ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్‌ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి.. ఈ సినిమాను టైమ్ చూసి రిలీజ్ చేస్తానని అంటున్నాడు.

రామదూత క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తయింది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజైంది. ఇప్పుడు పోస్టర్లు వచ్చాయి. త్వరలోనే ఓ ఎమోషనల్ సాంగ్ తో పాటు, టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో వైయస్‌.భారతి పాత్రలో మానస నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి చంద్రబాబు పాత్రను పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ, తాజాగా వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర కూడా ఉందనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. పవన్ పాత్ర లుక్ ను కూడా అతడు విడుదల చేశాడు

Tags:    
Advertisement

Similar News