Gaami | ఉగాది స్పెషల్ గా విశ్వక్ సేన్ సినిమా

Gaami Streaming - రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది గామి సినిమా. అంతలోనే ఓటీటీలోకి కూడా వచ్చేస్తోంది.

Advertisement
Update: 2024-04-03 17:01 GMT

విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం గామి. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కొంతమందికి మాత్రమే నచ్చింది. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రాన్నిఉగాది సందర్భంగా జీ5లో ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది.

అక్కడ 36 ఏళ్లకు ఒకసారి అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు.

అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు, ఈ విజువల్ వండర్ ను 12వ తేదీ నుంచి ఓటీటీలో ఆస్వాదించవచ్చు.

Tags:    
Advertisement

Similar News