Mark Antony | తన నమ్మకం కచ్చితంగా నిజమౌతుందంటున్న విశాల్

Vishal Mark Antony - మార్క్ ఆంటోనీ కచ్చితంగా హిట్టవుతుందని చెబుతున్నాడు విశాల్. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టాడు.

Advertisement
Update: 2023-09-11 17:43 GMT

మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు హీరో విశాల్. ఇతడు ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా 19 ఏళ్లు అయిందంట.

"ఈ రోజుతో నా మొదటి చిత్రం చల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) రిలీజై 19 ఏళ్లు అవుతోంది. ఆడియెన్స్ నా సినిమాలకు డబ్బులు పెట్టి, టికెట్ కొని చూస్తున్నారు. ఆ డబ్బుతో నేను, నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలని నేను అనుకోను. ఆ డబ్బులు అందరికీ ఉపయోగపడాలని అనుకుంటాను. ఇప్పటికీ ఆ ఆలోచనే నన్ను నడిపిస్తోంది."

ఇలా తను హీరోగా 19 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయాన్ని బయటపెట్టాడు విశాల్. మార్క్ ఆంటోనీ గురించి మాట్లాడుతూ... నిర్మాత వినోద్ వల్లనే సినిమా బాగా వచ్చిందని చెబుతున్నాడు.

"నిర్మాత వినోద్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నా కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం. మాకు పునాదిలా నిర్మాత నిలబడ్డారు. 9 ఏళ్ల క్రితం ఓ లవ్ స్టోరీని రాసుకున్నాడు. ఇది కథనా? అని నిర్మాత బయటకు వెళ్లమన్నాడు. నలబై మంది బయటకు గెంటేశారు. ఓ సినిమా తీశాడు. ఫ్లాప్ అయింది. ఏడేళ్లుగా మా ప్రయాణం సాగుతోంది. మా ప్రాజెక్ట్‌ను ప్రకటించిన తరువాత చాలా మంది వద్దు అన్నారు. నేను ఎందుకు చేశాను.. ఆ నమ్మకం ఏంటన్నది సెప్టెంబర్ 15న అందరికీ తెలుస్తుంది."

పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది మార్క్ ఆంటోనీ సినిమా. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ కనిపించాయి. కానీ సినిమా మాత్రం ఆద్యంతం నవ్విస్తుందని చెబుతున్నాడు విశాల్.

Tags:    
Advertisement

Similar News