Kushi Movie | ట్రయిలర్ పై అప్ డేట్ ఇచ్చిన దేవరకొండ

Kushi movie trailer - విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. మరో 2 రోజుల్లో రిలీజ్ కానుంది.

Advertisement
Update: 2023-08-07 13:37 GMT

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నారు.

ఇప్పటిదాకా ఖుషి నుంచి రిలీజ్ చేసిన లిరికల్ పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన పాటలు యూట్యూబ్ ను షేక్ చేశాయి. టైటిల్ సాంగ్ అయితే ట్రెండ్ సెట్ చేస్తోంది. దీంతో ఖుషి మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వస్తున్న ట్రయిలర్ పై అందరి దృష్టి పడింది.

సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, ఖుషిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అటు సమంతకు ఈ సినిమా కీలకంగా మారింది. ఎందుకంటే, ఆమె శాకుంతలం రూపంలో పెద్ద ఫ్లాప్ ఇచ్చింది.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి స్పందన వచ్చింది. ట్రయిలర్ కూడా క్లిక్ అయితే, ఖుషి సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడం కోసం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్ లో విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News