Kushi Movie | ఖుషి మూవీ షూటింగ్ అప్ డేట్

Vijay Deverakonda's Kushi Movie - విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

Advertisement
Update: 2023-07-15 17:09 GMT

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. పాన్ ఇండియా మూవీగా రాబోతోన్న ఈ మూవీని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతోన్నారు.

ఖుషి సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చారు. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశాడు విజయ్ దేవరకొండ.

హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన 2 పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

లైగర్ లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అటు శాకుంతలం డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, సమంత కూడా ఖుషి పై చాలా హోప్స్ పెట్టుకుంది. వీళ్లిద్దరి ఆశల్ని ఖుషి సినిమా నెరవేరుస్తుందా లేదా అనేది చూడాలి.

Tags:    
Advertisement

Similar News