Family Star | హీరోయిన్ తో ఫ్యామిలీ స్టార్ దీపావళి

Vijay Deverakonda - ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా నుంచి దీపావళి పోస్టర్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2023-11-12 16:55 GMT

హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "ఫ్యామిలీ స్టార్". భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ లుక్ రిలీజయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులకు తమదైన స్టయిల్ లో శుభాకాంక్షలు చెప్పారు హీరోహీరోయిన్లు.

"ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి దీపా‌వళి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ క్రాకర్స్ కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ఫ్యామిలీ స్టార్" సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్నాడు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54న సినిమా ఇది. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నాడు. 

Tags:    
Advertisement

Similar News