Vijay Deverakonda | మరో సినిమాపై ఫోకస్ పెట్టిన దేవరకొండ

Vijay Deverakonda - ఫ్యామిలీ స్టార్ సినిమాను దాదాపు పూర్తి చేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు తన దృష్టిని గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన సినిమాపై పెట్టాడు.

Advertisement
Update: 2024-02-23 02:20 GMT

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీపై అతడు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే, గీతగోవిందం లాంటి మేజిక్ ను ఈ సినిమా రీ-క్రియేట్ చేస్తుందని అతడు భావిస్తున్నాడు.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చింది. ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది. దీంతో అతడు తన ఫోకస్ ను మార్చాడు. గౌతమ్ తిన్ననూరి సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయ్యాడు విజయ్ దేవరకొండ.

జూన్ నుంచి గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్. పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. దాదాపు 40శాతం షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది. అందుకే ఫ్యామిలీ స్టార్, గౌతమ్ తిన్ననూరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు విజయ్. 

Tags:    
Advertisement

Similar News