Vijay Deverakonda: లైగర్ ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ స్పందన

ఎట్టకేలకు లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై స్పందించాడు హీరో విజయ్ దేవరకొండ. చాలా కష్టపడ్డామని, కానీ ఆశించిన ఫలితం రాలేదన్నాడు.

Advertisement
Update: 2022-11-06 11:21 GMT

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. ఈ హీరో కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఓటీటీలో కూడా ఈ సినిమా ఫెయిలైంది. ఎట్టకేలకు ఈ సినిమా పరాజయంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు.

"అవును.. లైగర్ నన్ను నిరాశపరిచింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఆశించిన ఫలితం రాలేదు. అయితే లైగర్ ప్రాసెస్ ను నేను ఎంజాయ్ చేశాను. ఆ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. పాన్ ఇండియా లెవెల్లో సినిమా కోసం ఎంత కష్టపడాలి, ఎంతలా ప్రచారం చేయాలి లాంటి విషయాల్ని తెలుసుకున్నాను."

ఇలా లైగర్ ఫ్లాప్ పై స్పందించాడు విజయ్ దేవరకొండ. చాలా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఫలితం రాకపోతే, అక్కడితో ఆగిపోకూడదని, అక్కడ్నుంచి ముందుకు వెళ్లడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని అన్నాడు. ఆ మానసిక పరిపక్వత తనకు వచ్చిందంటున్నాడు.

వ్యక్తిగతంగా లైగర్ సినిమా తనలో చాలా సానుకూల మార్పులు తీసుకొచ్చిందంటున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా టైమ్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానంటున్న విజయ్ దేవరకొండ, ఇకపై లైగర్ సినిమా గురించి ఎక్కడా మాట్లాడనని స్పష్టం చేశాడు.

Tags:    
Advertisement

Similar News