Vijay Deverakonda: ముంబయిలో విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు?

Vijay Deverakonda - నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. దీంతో అతడిపై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటవి?

Advertisement
Update: 2022-11-25 06:15 GMT

Vijay Deverakonda in a crazy Hindi remake!

హీరో విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లిన ప్రతిసారి అతడిపై పుకార్లు రావడం సహజం. ఎందుకంటే, హీరోయిన్ రష్మిక అక్కడే ఉంటోంది. ఆమెను కలిసేందుకే విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లాడని, వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు ముంబయి మీడియా కథనాలు వండివారుస్తూనే ఉంటుంది.

ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ ముంబయిలోనే ఉన్నాడు. దీంతో బాలీవుడ్ మీడియా ఎటెన్షన్ మరోసారి అతడిపై పడింది. ఈసారి మరో కొత్త కథనం అందుకుంది మీడియా. ఓ బాలీవుడ్ డైరక్టర్ తో కథాచర్చల కోసం విజయ్ దేవరకొండ ముంబయి వచ్చాడనేది ఆ స్టోరీల సారాంశం.

నిజానికి స్టోరీ డిస్కషన్ కోసం విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లలేదు. ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొనేందుకు మాత్రమే అతడు వెళ్లాడు. ఈరోజు లేదా రేపు అతడు తిరిగి హైదరాబాద్ చేరుకుంటాడు.

అయితే అతడు రష్మికను మాత్రం కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే, రష్మిక తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ఈ నటుడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఖుషీ అనే సినిమా మాత్రమే ఉంది. లైగర్ ఫ్లాప్ తో ఈ సినిమా కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు.

Tags:    
Advertisement

Similar News