Vidudhala - ఈవారం డబ్బింగ్ సినిమాదే హవా

Vidudhala Part 1 - ఓవైపు మార్కెట్లో దసరా, రావణాసుర లాంటి సినిమాలున్నాయి. మరోవైపు శాకుంతలం సినిమా వచ్చింది. అయినప్పటికీ విడుదల అనే డబ్బింగ్ సినిమా మాత్రమే హిట్టయింది.

Advertisement
Update: 2023-04-18 02:36 GMT

వెట్రిమారన్.. తెలుగులో కూడా ఈ దర్శకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆడుకాలం, అసురన్, వడ చెన్నై వంటి కల్ట్ చిత్రాలను అందించాడు. ఈ దర్శకుడి తాజా చిత్రం విడుతలై. ఈ సినిమా తెలుగులో "విడుదల పార్ట్ 1" గా రిలీజైంది. విడుదలైన అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

విడుదల పార్ట్ 1 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి టాక్ తెచ్చుకుంది. నికార్సైన స్టోరీని అద్భుతమైన సన్నివేశలతో అద్భుతంగా తెరకెక్కించాడు. యాక్షన్ సీన్స్ రియలిస్టిక్ గా అనిపించాయి. రైలు ప్రమాద సన్నివేశం మొత్తం సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు.

ప్రతి పాత్ర వెనుక ఆయన చేసిన కృషి తెరపై కనిపిస్తుంది. ఇక సూరి, విజయ్ సేతుపతి, భవానీ శ్రీల నటన కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ ను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు మార్కెట్లో నడుస్తున్న ఏకైక సినిమా ఇదే. ఈ మూవీతో పాటు వచ్చిన శాకుంతలం డిజాస్టర్ అయింది.

Tags:    
Advertisement

Similar News