Venky Kudumula: చిరు, వెంకీ కుడుముల సినిమా ఆగినట్టే

Venky Kudumula: చిరంజీవి-వెంకీ కుడుముల సినిమా అధికారికంగా నిలిచిపోయింది. తాజాగా అడ్వాన్సులు వెనక్కి ఇవ్వడం కూడా జరిగిపోయింది.

Advertisement
Update: 2022-12-13 06:45 GMT

ఆమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఎప్పుడైతే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందో, అప్పుడు మరోసారి తన సినిమాలన్నింటినీ సమీక్షించారు. ఇందులో భాగంగా ఓ సినిమాను ఆయన వెనక్కినెట్టారు. అదే వెంకీ కుడుముల సినిమా.

చిరంజీవి-వెంకీ కుడుముల కాంబినేషన్ లో డీవీవీ దానయ్య బ్యానర్ పై రావాల్సిన సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమా స్థానంలో మారుతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కథాచర్చలు మొదలవుతాయి.

సినిమా ఆగిపోయినప్పటికీ డీవీవీ దానయ్య అడ్వాన్స్ చిరంజీవి దగ్గర అలానే ఉంది. సో.. ఏదో ఒక దర్శకుడితో డీవీవీ బ్యానర్ పై చిరంజీవి సినిమా ఉంటుందనేది పక్కా. అయితే వెంకీ కుడుముల అడ్వాన్స్ ను మాత్రం దానయ్య వెనక్కి తీసుకున్నారు.

చిరంజీవితో సినిమా అనగానే వెంకీకి భారీ అడ్వాన్స్ ఇచ్చారు దానయ్య. ఎప్పుడైతే ప్రాజెక్టు ఆగిపోయిందో వెంటనే అడ్వాన్స్ మొత్తం తీసుకున్నారు.

నిజానికి ఇలా అడ్వాన్సులు వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. ఏదో ఒక ప్రాజెక్టుతో సదరు దర్శకుడితో సినిమా చేయాలనే అనుకుంటాడు నిర్మాత. కానీ దానయ్య మాత్రం ఆశ్చర్యంగా వెంకీ కుడుముల నుంచి అడ్వాన్స్ వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకో, వెంకీ కుడుములపై దానయ్యకు నమ్మకం పోయింది. ప్రస్తుతం ఈ దర్శకుడు, నితిన్ తోనే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News