Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం

Venkatesh's Saindhav Movie Launch - వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం సైంధవ్. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.

Advertisement
Update: 2023-01-26 09:47 GMT

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ్’ ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు.

హీరో నాని, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, కె రాఘవేంద్రరావు, నిర్మాతలు మైత్రి నవీన్, శిరీష్, అనిల్ సుంకర, పీపుల్ మీడియా విశ్వ ప్రసాద్, ఇలా చాలామంది ఈ ఓపెనింగ్ కు వచ్చారు.

రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్‌ ఇవ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో భారీ అంచనాలను నెలకొల్పింది. సైంధవ్ భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

తాజాగా నవజుద్దీన్ సిద్ధిఖిని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు. ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటిస్తారు. అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది సైంధవ్.




Tags:    
Advertisement

Similar News