Operation Valentine | వాలంటైన్ వచ్చేశాడు

Operation Valentine - వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది.

Advertisement
Update: 2023-12-19 16:31 GMT

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ గత సంవత్సరం విడుదలైన విజయవంతమైన చిత్రం 'మేజర్' తర్వాత మరొక దేశభక్తి చిత్రంతో వస్తోంది. దాని పేరు 'ఆపరేషన్ వాలెంటైన్'. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ ని అందించింది టీజర్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులకు గూస్‌బంప్‌ ని ఇచ్చింది.

'ది ఫస్ట్ స్ట్రైక్' పేరిట వచ్చిన ఈ టీజర్ లో హీరో వరుణ్ తేజ్ కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. 'ఈ దేశం గాంధీజీ తో పాటు సుభాష్ చంద్రబోస్ ది కుడా' అని శత్రువులకు గుర్తు చేయడం మన దేశానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అతిపెద్ద వైమానిక దాడి నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.

నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అర్జున్ దేవ్‌గా వరుణ్ తేజ్, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లార్ నటించారు.

ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న తెలుగు, హిందీలో విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News