Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Varun Tej's Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ తాజా చిత్రం గాండీవధారి అర్జున. ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేశారు.

Advertisement
Update: 2023-06-08 12:06 GMT

వ‌రుణ్ తేజ్‌, ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంటెన్స్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌.. అందులో వ‌రుణ్ తేజ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన ఆన్ లొకేషన్ వీడియోకు కూడా మంచి బ‌జ్ క్రియేట్ అయింది.

చిత్ర యూనిట్ విదేశాల్లో శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉంది. ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు మేక‌ర్స్. ‘గాంఢీవధారి అర్జున’ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఆగ‌స్ట్ 25 భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా వేగవంతం చేశారు.

వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్ బ‌డ్జెట్ మూవీగా వస్తున్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు మేకర్స్. వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. గాండీవధారి అర్జున సినిమాలో గ్లోబల్ వార్మింగ్ అంశాన్ని ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. దీని చుట్టూ అల్లుకున్న కథకు యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి, చివర్లో మంచి సందేశాన్ని ఇచ్చారట.

Tags:    
Advertisement

Similar News