Varun Tej - Lavanya Tripati: ఇండియాలోనే వరుణ్ తేజ్ పెళ్లి?

Varun Tej - Lavanya Tripati: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఇండియాలోనే జరుగుతుందట, విదేశాలకు వెళ్లే ప్లాన్ లేదంట.

Advertisement
Update: 2023-06-11 11:30 GMT

Varun Tej - Lavanya Tripati: ఇండియాలోనే వరుణ్ తేజ్ పెళ్లి?

గ్రాండ్ గా జరిగింది వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం. నాగబాబు ఇంట్లో, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినప్పటికీ.. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోల రాకతో మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ ఈవెంట్.

స్వయంగా చిరంజీవి సమక్షంలో కాబోయే వధూవరులు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత పరస్పరం రింగులు మార్చుకున్నారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్, వీళ్లిద్దరికీ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక బన్నీ, చరణ్, సాయిధరమ్ తేజ్ హంగామా ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇలా ఎంగేజ్ మెంట్ అయిందో లేదో, అలా వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు ఊపందుకున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా వీళ్లిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. దీనికి ఓ లాజిక్ కూడా ఉంది. మిస్టర్ సినిమా షూటింగ్ టైమ్ లో ఇటలీలోనే బాగా క్లోజ్ అయ్యారు వరుణ్-లావణ్య. కాబట్టి పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కథనాలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ఏంటంటే.. వరుణ్-లావణ్య పెళ్లిని ఇండియాలోనే చేయాలని నిర్ణయించారు. డేట్ ఇంకా ఫిక్స్ చేయనప్పటికీ.. ఏ తేదీకైనా ఇండియాలోనే పెళ్లి చేయాలని అందరూ ఓ మాట అనుకున్నారు. ఇండియాలో పెళ్లి చేస్తే, చరణ్, బన్నీ, పవన్ లాంటి హీరోల కాల్షీట్లతో సమస్యలు ఉండవనేది నాగబాబు అభిప్రాయం. పైగా ఇండియాలో పెళ్లి పెట్టుకుంటే, ఎక్కువమంది అతిథులు వచ్చేందుకు కూడా వీలుగా ఉంటుంది. 

Tags:    
Advertisement

Similar News