Varun Tej | గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్

Varun Tej and Lavanya Tripathi - ఇటలీలో పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు, భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటుచేశారు.

Advertisement
Update: 2023-11-06 16:53 GMT

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి ముగిసింది. తాజాగా హైదరాబాద్ లో సినీ ప్రముఖులకు ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో నూతన వధూవరుల రిసెప్షన్‌పై అందరి దృష్టి ఉంది.

సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు, మీడియాకు కూడా ఆహ్వానించారు. అయితే ఫొటోలు తీసేందుకు కాదు, మీడియాను కూడా అతిథులుగా ఆహ్వానించారు. రిసెప్షన్ కోసం, వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ సంప్రదాయ దుస్తులను ఎంచుకున్నారు. ఇవి కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినవే.

ఇటలీలోని టుస్కానీలో ఉన్న అందమైన రిసార్ట్ లో లావణ్య-వరుణ్ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా కుటుంబం మొత్తం తరలివెళ్లింది. పవన్ కల్యాణ్, చిరంజీవి నుంచి అల్లు శిరీష్ వరకు అందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ, రేణుదేశాయ్ వెళ్లలేదు. తన పిల్లల్ని కూడా పంపించలేదు.

అలా ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ వెంటనే ఇండియాకు తిరిగొచ్చింది. వచ్చిన వెంటనే సినీ ప్రముఖులకు పెద్ద పార్టీ ఇచ్చింది. తాజా రిసెప్షన్ తో వరుణ్-లావణ్య పెళ్లి వేడుక ముగిసింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, తిరిగి తన సినిమాలతో బిజీ అవుతాడు వరుణ్ తేజ్.

Tags:    
Advertisement

Similar News