Sabari | థ్రిల్ ఇస్తానంటున్న వరలక్ష్మి

Varalaxmi Sabari Movie - తెలుగులో తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేసింది వరలక్ష్మి. ఈ సినిమా కచ్చితంగా థ్రిల్ ఇస్తుందని చెబుతోంది.

Advertisement
Update: 2024-04-13 17:24 GMT

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. తాజాగా 5 భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ... ''తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. వండర్ ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకువచ్చిన దర్శకుడు అనిల్ కి థాంక్స్. తన బిడ్డను కాపాడడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. 'హనుమాన్' సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఈ 'శబరి'ని కచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది. ఇది స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుంది."

చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో డ్యాన్స్ చేసింది వరలక్ష్మి. చాలామంది హనుమాన్ సినిమా తర్వాత వరలక్ష్మికి ఈ ఛాన్స్ వచ్చిందని భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందే, తనకు పెద్దగా సక్సెస్ లు లేని టైమ్ లోనే శబరి అవకాశం వచ్చిందని అంటోంది వరలక్ష్మి.

నిర్మాతగా ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా ఫిమేల్ ఓరియెంటెడ్ కథను నమ్మి రాజీ పడకుండా మహేంద్రనాధ్ తెరకెక్కించారని.. బడ్జెట్ ఎక్కువైనా బాక్సాఫీస్ రెవెన్యూ వస్తుందా? మార్కెట్ ఎంత? అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని ఖర్చు చేశారని మెచ్చుకుంది వరలక్ష్మి.

Tags:    
Advertisement

Similar News