Aadikeshava Movie Release Date | వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా వచ్చేస్తోంది

Vaishnav Tej's Aadikeshava Movie Release Date | వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ఆదికేశవ (Aadikeshava). ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది.

Advertisement
Update: 2023-07-07 16:46 GMT

ఆదికేశవ సినిమాలో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల

Aadikeshava Movie Release Date | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. దీని పేరు ఆదికేశవ. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, తాజా సెన్సేషన్ శ్రీలీల తొలిసారి జతకట్టారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. మెగాభిమానులు, యాక్షన్ ప్రేమికులకు ఆదికేశవ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెబుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్ టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా ఆదికేశవ విడుదల తేదీ ప్రకటించారు. సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య (త్రివిక్రమ్ భార్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.



Tags:    
Advertisement

Similar News