Vittalacharya | విఠలాచార్యపై పుస్తకం, ఆవిష్కరించిన త్రివిక్రమ్

Trivikram Vittalacharya - విఠలాచార్య జీవితం, కెరీర్ విశేషాలతో పుస్తకం వచ్చింది. త్రివిక్రమ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Advertisement
Update: 2023-10-02 08:21 GMT

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరేమో. తరాలు మారినా తరగని ఆదరణ పొందిన ఎన్నో చిత్రాలు తీశారాయన. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ లేని కాలంలోనే, వెండితెరపై మేజిక్ చేసి చూపించారాయన.

విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ భావించారు. అందుకే 'జై విఠలాచార్య' అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

'జై విఠలాచార్య' పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూస్తాను. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన తాలూకూ రీచ్ గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి, ప్రస్తుతం చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను."

సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, జమున, వాణీశ్రీ, రాజశ్రీ, జయమాలిని, నరసింహ రాజు... ఇలా ఎంతోమంది ప్రముఖులు విఠలాచార్య గురించి చెప్పిన సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీళ్లతో పాటు.. విఠలాచార్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.

తెలుగులో విఠలాచార్య 39 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలన్నింటి తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశారు పులగం. 






Tags:    
Advertisement

Similar News