Trinadharao Nakkina | నిర్మాతగా నక్కిన.. సినిమా ప్రకటన

Trinadharao Nakkina - త్రినాథరావు నక్కినకు దర్శకుడిగా ఓ స్టయిల్ ఉంది. ఇప్పుడీ దర్శకుడు నిర్మాతగా మారుతున్నాడు.

Advertisement
Update: 2024-02-08 17:08 GMT

ధమాకా, నేను లోకల్, సినిమా చూపిస్త మామ లాంటి కమర్షియల్ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఇప్పుడీ డైరక్టర్, ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. బ్యానర్ పెట్టాడు, కొత్త సినిమా కూడా ప్రకటించాడు.

త్రినాధరావు నక్కిన కొత్త బ్యానర్ పేరు నక్కిన నెరేటివ్స్. షార్ట్ కట్ లో ఎన్-ఎన్. ఈ బ్యానర్ పై నిర్మాతగా తన కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడు నక్కిన. అయితే ఆ సినిమాకు అతడు దర్శకత్వం వహించడం లేదు. అంతేకాదు, నక్కిన సినిమాలకు రెగ్యులర్ గా కథలు అందించే బెజవాడ ప్రసన్నకుమార్ కు కూడా ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేనట్టు కనిపిస్తోంది.

చందు మొండేటి దగ్గర డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన ఓ కుర్రాడ్ని తన కొత్త సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమాకు ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కథ అందించినట్టు తెలుస్తోంది.

ఇక హీరోహీరోయిన్ల విషయానికొస్తే, అంతా కొత్త వాళ్లతో ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకువాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి. మొత్తానికి మరో దర్శకుడు నిర్మాతగా మారాడన్నమాట.

Tags:    
Advertisement

Similar News