Tillu Square | టిల్లూ స్క్వేర్.. మరో రిలీజ్ డేట్

Tillu Square - డీజే టిల్లూకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లూ స్క్వేర్ మూవీకి కొత్తగా మరో విడుదల తేదీ ఖరారు చేశారు.

Advertisement
Update: 2024-01-26 15:21 GMT

సిద్ధు జొన్నలగడ్డ తన "డిజె టిల్లు" సినిమాతో "టిల్లు"గా సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రకటన వచ్చినప్పటి నుండి, "టిల్లు స్క్వేర్" సీక్వెల్‌లో సిద్ధు జొన్నలగడ్డను మరోసారి బిగ్ స్క్రీన్‌పై "టిల్లు"గా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతిసారి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది.

మేకర్స్ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఒరిజినల్ కు మించిన సీక్వెల్ చేయడానికి తగినంత సమయం తీసుకున్నప్పటికీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది. ఇప్పుడు మేకర్స్ వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు.

‘టిల్లు ఫ్రాంచైజీ’ నుంచి వస్తున్న టిల్లూ స్క్వేర్ కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.

ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలోని ఆమె "కిల్లర్" లుక్స్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News