Tillu Square | పాటలతో సందడి షురూ చేసిన టిల్లూ

Tillu Square - సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా టిల్లూ స్క్వేర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2023-07-26 13:36 GMT

డీజే టిల్లు సినిమాతో, అందులోని పాత్రతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు, స్టార్ బాయ్‌గా ఎదిగాడు. అతను ఆ పాత్రను రూపొందించి, అందులో జీవించిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సిద్ధు అనే పేరు కంటే టిల్లూ పేరుతోనే పాపులర్ అయిపోయాడు ఈ హీరో. టిల్లు అన్నగా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన సిద్ధు, ఇప్పుడు మరొక థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ 'టిల్లు స్క్వేర్‌'తో వస్తున్నాడు.

ఈ సీక్వెల్ తో మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నాం. ఈసారి వినోదం రెట్టింపు ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

డీజే టిల్లు సినిమాలో మ్యూజిక్ పెద్ద హిట్టయింది. ముఖ్యంగా, రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన "టిల్లు అన్న డీజే పెడితే" అనే సాంగ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 'టిల్లు స్క్వేర్' కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించాడు. ఈరోజు ఈ సాంగ్ రిలీజ్ అయింది.

టిల్లూ స్టయిల్ కు తగ్గట్టే ఫుల్ జోష్ గా ఉంది ఈ సాంగ్. "టికెట్ ఏ కొనకుండా" అనే లిరిక్స్ తో సాగే ఈ పాట.. యూత్ కు ఆకట్టుకునేలా సాగింది. సాంగ్ చూస్తుంటే.. టిల్లు స్క్వేర్ చిత్రం డీజే టిల్లుకి మించి సరికొత్త వినోదాన్ని అందించబోతుందని స్పష్టమవుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్ మరియు టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌ అయింది. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.

Full View

Tags:    
Advertisement

Similar News