Tillu Square | భారీ వసూళ్లు దిశగా టిల్లూ స్క్వేర్

Tillu Square - ప్రపంచవ్యాప్తంగా టిల్లూ స్క్వేర్ సినిమా సూపర్ హిట్టయింది. 2 రోజుల్లో భారీ వసూళ్లు సాధించింది.

Advertisement
Update: 2024-03-31 07:17 GMT

తమ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని ఘనంగా ప్రకటించాడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాత నాగవంశీ. అతడి మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది. థియేటర్లు ఖాళీగా ఉండడం, ఎగ్జామ్స్ సీజన్ ముగింపు దశకు చేరడం, సినిమాపై భారీ అంచనాలుండడం, తాజాగా రిలీజ్ చేసిన ట్రయిలర్ హిట్టవ్వడం.. ఇలా ఎన్నో అంశాలు కలిసి టిల్లూ స్క్వేర్ కు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.

అలా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 23.7 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా, రెండో రోజుకు తన వసూళ్లను మరింత పెంచుకుంది. నిన్నటితో 2 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ ఏకంగా 45.3 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో టిల్లూ స్క్రేర్ కు పోటీ లేదు. ఓంభీమ్ బుష్ సినిమా ప్రారంభంలో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత చతికిలపడింది.

దీంతో ప్రస్తుతం థియేటర్లలో టిల్లూ స్క్వేర్ సినిమాకు మాత్రమే క్రేజ్ ఉంది. సో.. నాగవంశీ చెప్పినట్టు ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా హవా కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యేసరికి 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా.

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. సిద్ధు స్వయంగా ఈ సినిమాకు కథ రాసి, హీరోగా నటించాడు. అతడి యాక్టింగ్, వన్ లైన్ పంచ్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. 

Tags:    
Advertisement

Similar News