Teja Sajja | కొత్త సినిమా ప్రకటించిన హనుమాన్ హీరో

Teja Sajja - హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ కొత్త సినిమాపై అందరి దృష్టి పడింది. ఈరోజు తన కొత్త సినిమా వివరాలు బయటపెట్టాడు ఈ హీరో.

Advertisement
Update: 2024-04-15 17:16 GMT

హను-మాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, తన నెక్ట్స్ మూవీ ప్రకటించాడు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేనితో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టును ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.

ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ తో వెనక్కు తిరిగి నిల్చున్నాడు. హనుమాన్ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ ,ఇక్కడ మాత్రం స్టైలిష్ మేకోవర్ తో సూపర్ యోధాగా అద్భుతంగా కనిపించాడు. ఈ సినిమా టైటిల్ ని ఏప్రిల్ 18న ప్రకటించనున్నారు.

ఈగిల్ తర్వాత కార్తీక్ ఘట్టంనేని. పీపుల్ మీడియా కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్టు ఇది. అద్భుతమైన టెక్నీషియన్ అయిన కార్తీక్ ఘట్టంనేని, తేజ సజ్జను చాలా పెద్ద పాత్రలో చూపించబోతున్నాడు. ఇది సూపర్ యోధా సాహసోపేతమైన కథ.

ఏప్రిల్ 18న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News