Tarun | తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటుడు

Tarun marriage - తరుణ్ పెళ్లిపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. వాటిని ఈ నటుడు ఖండిస్తున్నాడు.

Advertisement
Update: 2023-08-03 03:05 GMT

తరుణ్ కు ఇప్పుడు 42 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అది అతడి ఇష్టం. కానీ ఓ సెక్షన్ మీడియా మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మరోసారి తరుణ్ పెళ్లిపై పుకార్లు చెలరేగాయి. ఈ నటుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందనేది ఆ ఊహాగానం సారాంశం. దీనిపై తరుణ్ స్పందించాడు.

ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ... ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పాడు. నిజంగా తను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నాడు.

తరుణ్ కు ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడం లేదు. అతడు తన సొంత వ్యాపారాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు సొంత బిజినెస్ చూసుకుంటూనే, మరోవైపు ఓటీటీలోకి తరుణ్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు తరుణ్ ను సంప్రదించాయి. అయితే దీనిపై కూడా తరుణ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తరుణ్ పెళ్లిపై గతంలోనే పుకార్లు వచ్చాయి. ఆర్తి అగర్వాల్, ప్రియమణి లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. తరుణ్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News