Tapsee Wedding | తాప్సి పెళ్లి వీడియో లీక్

Tapsee Wedding Video - రీసెంట్ గా పెళ్లి చేసుకుంది తాప్సి. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. అయితే ఆమె పెళ్లి వీడియో లీక్ అయింది.

Advertisement
Update: 2024-04-03 17:04 GMT

హీరోయిన్ తాప్సి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 23న ఆమె తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ మథియాస్ బో ను వివాహం చేసుకుంది. అయితే ఆ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించలేదు. దీనికి కారణం కూడా ఉంది. ఆమె ప్రస్తుతం ఏ సోషల్ మీడియా వేదికలో లేదు. అందుకే ఆమె పెళ్లి విషయం బాహ్య ప్రపంచానికి తెలియలేదు.

ఇదిలా ఉండగా.. తాప్సి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆన్ లైన్ వేదిక రెడ్డిట్ లో తాప్సి-మథఇయాస్ పెళ్లి వీడియో వైరల్ అయింది. ఎవరో కావాలనే ఈ వీడియోను లీక్ చేసినట్టు అనిపిస్తోంది.

వీడియోలో ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో, కళ్లద్దాలు పెట్టుకొని ఉంది తాప్సి. ఆమెను ఊరేగింపుగా మథియాస్ వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాప్సి డాన్స్ కూడా చేసింది. మథియాస్ దగ్గరకు వచ్చిన వెంటనే అతడ్ని కౌగలించుకొంది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ వెంటనే పెళ్లికొచ్చిన అతిథులంతా నూతన వధూవరులపై పూలవర్షం కురిపించారు.

ఈ వీడియోతో తాప్సి పెళ్లి చేసుకుందనే విషయం బయటకొచ్చింది. అటు తాప్సి మాత్రం ఇప్పటికీ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించడం లేదు. పెళ్లయిన వారం రోజులకే ఆమె తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయింది. తాజాగా ఫొటోషూట్ లో కూడా పాల్గొంది.

Tags:    
Advertisement

Similar News