Tamanna | మరో హారర్ సినిమాలో తమన్నా

Tamanna - మరో హారర్ సినిమాలో నటిస్తోంది తమన్న. ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం..

Advertisement
Update: 2024-04-10 17:39 GMT

అరణ్మనై తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, ఈ సినిమాకు సంబంధించి తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాలుగో ఫ్రాంచైజీ తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ బ్యానర్ పై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటిస్తుండగా, తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌లను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి. తమన్నాని శివానిగా పరిచయం చేశారు. ఆమె సంప్రదాయ గెటప్‌లో కనిపిస్తోంది. సుందర్ సి శివశంకర్‌గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తోంది. రెండు పోస్టర్లు ఆకట్టుకున్నాయి.

హిపాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రం తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దక్కించుకుంది. ఏపీ, తెలంగాణ లో భారీగా విడుదల చేయనుంది. ఈ నెల్లోనే ఈ సినిమా వస్తోంది.

Tags:    
Advertisement

Similar News