Sundeep Kishan | సైన్స్ ఫిక్షన్ సినిమాలో సందీప్ కిషన్

Sundeep Kishan - కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడు సందీప్ కిషన్. ఈ మూవీ తాజాగా లాంచ్ అయింది.

Advertisement
Update: 2023-09-26 04:25 GMT

సందీప్ కిషన్ విభిన్న తరహా చిత్రాలు ట్రై చేస్తుంటాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈ హీరో, ప్రస్తుతం ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే బ్యానర్ లో మరో సినిమా సైన్ చేశాడు సందీప్ కిషన్. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు సివి కుమార్ ఈ చిత్రం కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. మాయవన్ వరల్డ్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం, మాయవన్‌కి సీక్వెల్ కానుంది. టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో, సూపర్‌ విలన్‌తో ఒక సామాన్యుడి పోరాటాన్ని చూపించబోతున్నారు.

తాజాగా ఈ ప్రాజెక్టు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు దామోదర్ ప్రసాద్ క్లాప్‌ ఇవ్వగా, వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి జెమినీ కిరణ్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రభాస్ కల్కి సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుందని అంటున్నాడు హీరో సందీప్ కిషన్.

Tags:    
Advertisement

Similar News