Michael Movie: మైఖేల్ ప్రాజెక్ట్ ఆలోచన తనదే అంటున్న సందీప్ కిషన్

Sundeep Kishan about Michael movie - సందీప్ కిషన్ నటించిన చిత్రం మైఖేల్. ఈ మూవీకి బీజం వేసింది తానే అంటున్నాడు సందీప్.

Advertisement
Update: 2023-02-03 10:30 GMT

మైఖేల్ సినిమా ఆలోచన తనదే అంటున్నాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాకు బీజం వేసింది, అన్నీ సమకూర్చింది తానేనని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు దర్శకుడ్ని ఎంచుకోవడంతోనే సగం పని పూర్తయిందని అంటున్నాడు.


"మైఖేల్ ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన నాదే. దానికి సూట్ అయ్యే డైరెక్టర్ ని ఎంచుకోవడంతో సగం పని పూర్తయింది. భరత్ చౌదరి, మోహన్ రావు లాంటి నిర్మాతలు తోడవ్వడంతో ఇక మా దృష్టి అంతా ప్రోడక్ట్ ని సరిగా డెలివర్ చేయడంపైనే పెట్టాం. మైఖేల్ సినిమా చేయడమే మా సక్సెస్. ఇప్పటివరకూ నేను చేయాలనుకోని చేయలేనిది ఏంటని అలోచించినపుడు మైఖేల్ ఐడియా వచ్చింది. రంజిత్ తీసిన ఒక సినిమా చూశాను. నా ఆలోచన ఆయనకి చెప్పిన నెల రోజుల తర్వాత మైఖేల్ కథ చెప్పాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ తనకు ఏం కావాలో అది ఇస్తూ సపోర్టు చేసుకుంటూ వెళ్తున్నాను."


ఇలా మైఖేల్ సినిమాకు బీజం ఎలా పడిందో వివరించాడు సందీప్ కిషన్. తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా ప్రాజెక్టుగా మైఖేల్ మూవీ చేసిన సందీప్ కిషన్.. ఇది పాన్ ఇండియా సినిమా అవుతుందనే విషయం తొలిసారి కథ విన్నప్పుడే తనకు అర్థమైందని.. అందుకే చాలా కష్టపడి సినిమా చేశానని అన్నాడు.


ఈరోజు థియేటర్లలోకి వచ్చింది మైఖేల్ సినిమా. రంజిత్ జయకొడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దివ్యాన్ష కాషిక్ హీరోయిన్ గా నటించింది.

Tags:    
Advertisement

Similar News